కుప్పంలో పెద్దిరెడ్డి విర్రవీగిపోయారు : బుద్ధా 1 y ago
AP : కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విర్రవీగిపోయారన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కానీ అక్కడ ప్రజలు డబ్బుకు లొంగకుండా చంద్రబాబునే అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. 2019 -2024 మధ్యలో మద్యానికి బానిసై చనిపోయిన వారి సంఖ్య 100 శాతానికి పెరిగిందన్నారు. ఇది తాము చెప్పిన లెక్కలు కాదని, నేషనల్ క్రైమ్ రికార్డ్ ఆఫ్ బ్యూరో చెప్పిందన్నారు. ఈ మరణాలకు కారణం పెద్దిరెడ్డి కుటుంబం కాదా ? అని ప్రశ్నించారు.